సివిల్స్ సాధించిన పోలీస్ కుటుంబాలకు డీజీపీ అభినందనలు

సివిల్స్ సాధించిన పోలీస్ కుటుంబాలకు డీజీపీ అభినందనలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: పోలీస్ సిబ్బంది కుటుంబాల నుంచి సివిల్ సర్వీసెస్‌‌‌‌కు ఎంపికైన ముగ్గురిని డీజీపీ జితేందర్ అభినందించారు. గురువారం డీజీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డీజీపీ సహా లా అండ్‌‌‌‌ ఆర్డర్ డీజీ మహేశ్‌‌‌‌భగవత్‌‌‌‌, సీఐడీ చీఫ్‌‌‌‌ శిఖా గోయల్‌‌‌‌, అడిషనల్ డీజీ అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, ఐజీ రమేశ్‌‌‌‌ రెడ్డి.. సివిల్ సర్వీసెస్‌లో ర్యాంకులు సాధించిన అభ్యర్థుల కుటుంబాలకు అభినందనలు తెలిపారు. ర్యాంకర్ల తండ్రులు డిపార్ట్మెంట్‌లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు.