పవన్ వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ ద్వారక తిరుమలరావు...ఏమన్నారంటే.?

పవన్ వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ ద్వారక తిరుమలరావు...ఏమన్నారంటే.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అలాగే శాంతి భద్రతలు వంటి అంశాలపై చేసిన వ్యాఖ్యలపై డీజీపీ ద్వారక తిరుమలరావు స్పందించారు. ఇందులో భాగంగా తాము కూడా దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ అనే ధ్యేయంతో పని చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకి లొంగకుండా,  రాజ్యాంగానికి కట్టుబడి పని చేస్తామని స్పష్టం చేశారు. 

వాస్తవ పరిస్థితుల ఆధారంగానే ఏ కేసునైనా విచారిస్తామని, అలాగే ఎవరికి ఎంత ప్రొటోకాల్ ఇవ్వాలో అంతే ఇవ్వాలని ఆయన అన్నారు. ఇక డీజీపీ ఆఫీస్ లో సంతకాలు చేస్తున్న వారిలో ఏడు మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చామని, మరో ముగ్గురిని సస్పేండ్ చేశామని తెలిపారు. అలాగే మిగిలిన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని డీజీపీ ద్వారక తిరుమలరావు వెల్లడించారు. 

Also Read : ఎప్పుడూ అదే ప్రశ్నా..? మీది మీరు చూసుకోండి

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే పవన్ మీడియాతో మాట్లాడుతూ చిన్నారులపై లైంగిక దాడులు, అత్యాచారాలు వంటివాటి గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు ఏమాత్రం బాగోలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కొందరు పోలీసులు  కులమత భేదాలను చూపిస్తూ లా అండ్ ఆర్డర్ ని అమలు చేయడంలో అలసత్వం చూపిస్తున్నారని దీంతో ఇదే అదునుగా చేసుకుని నేరగాళ్లు రెచ్చిపోతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో పరిస్థితులు ఇలానే కొనసాగితే హోం మినిష్టర్ బాధ్యతులు తానె తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.