- రూ.11.06 కోట్ల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందించిన డీజీపీ
హైదరాబాద్, వెలుగు: వరద బాధితుల కోసం రాష్ట్ర పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒక రోజు జీతం అందించింది. రాష్ట్రం వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది జీతం నుంచిరూ.11,06,83,571ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేసింది.
పోలీస్ అకాడమీలో బుధవారం జరిగిన 2024 బ్యాచ్ ఎస్‌ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డికి డీజీపీ జితేందర్ చెక్కును అందించారు. హోంశాఖ స్పెషల్ సెక్రటరీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి, ఐజీ రమేష్ రెడ్డి, పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.