సిటీలో లా అండ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ బాగుండాలె: డీజీపీ

సిటీలో లా అండ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ బాగుండాలె: డీజీపీ
  • క్రైమ్, రౌడీ షీటర్లపై నియంత్రణ ఉండాలి
  • సీపీలు, డీసీపీలతో  ఇంటరాక్షన్​లో డీజీపీ జితేందర్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: హైదరాబాద్​ సిటీలో లా అండ్ ఆర్డర్ నిర్వహణ సక్రమంగా ఉండాలని డీజీపీ జితేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులకు సూచించారు. క్రైమ్‌‌‌‌‌‌‌‌, రౌడీ షీటర్ల నియంత్రణలో కఠినంగా వ్యవహరిం చాలన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. బోనాలు ఇతర పండుగల నేపథ్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన శుక్రవారం సిటీ పోలీసులతో ఇంటరాక్షన్ సెషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌లోని కమాండ్‌‌‌‌‌‌‌‌ అండ్ కంట్రోల్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 


సీపీ శ్రీనివాస్​ రెడ్డితో పాటు అడిషనల్‌‌‌‌‌‌‌‌ సీపీలు, డీసీపీ స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. హైదరాబాద్ గ్లోబల్, కాస్మోపాలిటన్ సిటీగా రూపుదిద్దుకుందని అన్నారు. టెక్నికల్ మ్యాన్ పవర్, భారీ పెట్టుబడులకు అనుకూలమైన సిటీగా, దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా పేరుపొందిందని తెలిపారు. ట్రాఫిక్ రద్దీ సమయాల్లో క్రమబద్ధీకరణ, పబ్లిక్ సేఫ్టీకి అవసరమైన రీతిలో ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. 

క్యాష్ చలాన్స్‌‌‌‌‌‌‌‌తో పాటు నంబర్ ప్లేట్స్‌‌‌‌‌‌‌‌, డ్రంక్ అండ్​ డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు. ట్రాఫిక్ సిగ్నల్‌‌‌‌‌‌‌‌ వినియోగం, ట్రాఫిక్ పోలీసుల పనితీరుపై ప్రతివారం నివేదిక ఇవ్వాలని సూచించారు.