అల్లు అర్జున్ కి మేం వ్యతిరేకం కాదు... రూల్స్ ప్రకారమే చేశాం: డీజీపీ జితేందర్ రెడ్డి

అల్లు అర్జున్ కి మేం వ్యతిరేకం కాదు...  రూల్స్ ప్రకారమే చేశాం: డీజీపీ జితేందర్ రెడ్డి

టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే అరెస్ట్ అయ్యి బెయిల్ పై రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి కరీంనగర్ జిల్లా డీజీపీ డాక్టర్ జితేందర్ రెడ్డి స్పందించారు. ఇందులోభాగంగా పోలీసులు అల్లు అర్జున్ కి వ్యతిరేకం కాదని, కేవలం చట్టప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మరణించడం బాధాకరమని అన్నారు. 

ఇక మీడియా రిపోర్టర్లపై దాడి కేసులో ప్రముఖ హీరో, సినీ నిర్మాత మంచు మెహన్ బాబుపై కేసు నమోదు చేశామని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపాడు. చట్టం ముందు అందరూ సమానమేనని, ప్రజల భద్రతకంటే ఏదీ ముఖ్యం కాదని కాబట్టి తప్పు చేసినవారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 

ఈ విషయం ఇలా ఉండగా డిసెంబర్ 4న బుధవారం రాత్రి పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ కి అల్లు అర్జున్ హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ కి సినిమా చూడటానికి వచ్చాడు. ఈ క్రమంలో థియేటర్ వద్దకి భారీగా అల్లు అర్జున్ ని చూడటానికి అభిమానులు వచ్చారు.  దీంతో తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందింది.  దీంతో అల్లు అర్జున్, సంధ్య థియేటర్ యాజమాన్యంపై పలు సెక్షన్ల క్రింద కేసులు నందుకు చేసి అరెస్ట్ చేశారు. దీంతో సంధ్య థియేటర్ ఘటన తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.