పోలీసులకు ప్రశంసలు : డీజీపీ జితేందర్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: భారీ వర్షాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందిని డీజీపీ జితేందర్ అభినందించారు. నల్గొండ, నాగర్​కర్నూల్ జిల్లాలో వరదనీటిలో చిక్కుకుపోయిన డిండి మండలం గోనబోయినపల్లి గ్రామానికి చెందిన 10 మంది చెంచు గిరిజనులను కాపాడటంపై హర్షం వ్యక్తం చేశారు.

మెదక్ జిల్లా క్విక్ రెస్పాన్స్ టీం (క్యూఆర్టీ) పోలీసులు, గ్రామ యువకులను ప్రశంసించారు. మెదక్ జిల్లా టెక్మాల్‌‌‌‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండు వాగులో కొట్టుకుపోతున్న రమావత్ నందు(45)ను క్యూఆర్టీ పోలీసులు, హోంగార్డ్ మహేశ్ సహా మరో ఇద్దరు యువకులు కాపాడారు. 

ఖైదీలకు తగిన భద్రత కల్పించండి

జైళ్లలోని ఖైదీల భద్రతపై పోలీస్ డిపార్ట్ మెంట్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలు, కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలకు ఎలాంటి ప్రాణహాని లేకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. మంగళవారం డీజీపీ ఆఫీసులో ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు.  జైళ్ల నుంచి ఖైదీలను కోర్టులకు, ఆసుపత్రులకు తీసుకెళ్లే సమయంలో భద్రత కల్పించాలని సూచించారు. జైళ్లలో భద్రత చర్యలపై డీజీపీ పలు సూచనలు చేశారు.