శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే ఎవర్నీ వదలం..డీజీపీ హెచ్చరిక

శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే ఎవర్నీ వదలం..డీజీపీ హెచ్చరిక

తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు డీజీపీ జితేందర్. చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. హైదరాబాద్ , తెలంగాణలో పరిస్థితిని చెడగొట్టేందుకు ప్రయత్నించే వ్యక్తులపై జీరో టాలరెన్స్  ఉంటుందని చెప్పారు డీజీపీ. 

ఇటీవల జరిగిన పరిణామాలతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్  లోని ట్రై కమిషనరేట్  లలో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని సీపీలకు సూచించారు డీజీపీ. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని జితేందర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పోలీసుల ప్రతిష్టను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాలన్నారు డీజీపీ. 

ALSO READ ; బీఆర్ఎస్‎తో కాదు.. ఓ చీటర్‌, బ్రోకర్‌తో ఫైట్‌ చేస్తున్నా: ఎమ్మెల్యే గాంధీ ఫైర్

PAC చైర్మన్  అరెకపూడి గాంధీ,  BRS MLA కౌశిక్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్ల వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే..సెప్టెంబర్ 12న కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఐతే ఈ చర్యకు ప్రతిచర్యగా ఇవాళ బీఆర్ఎస్ నేతలతో కలిసి... అరికెపూడి ఇంటికి వెళ్తానని సవాల్ చేశారు కౌశిక్ రెడ్డి. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి బయల్దేరి కూకట్ పల్లిలోని గాంధీ ఇంటికి వస్తానని ప్రకటించారు కౌశిక్. దీంతో అటు కౌశిక్ ఇంటితో పాటు మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్ ముందు పోలీసులు భారీగా మోహరించారు.