
- త్వరలోనే ఏర్పాటు చేస్తాం
- డీజీపీ జితేందర్ వెల్లడి
వనపర్తి/ అమరచింత, వెలుగు : త్వరలోనే జూరాల పోలీస్ ఔట్ పోస్ట్ ను ఏర్పాటు చేస్తామని డీజీపీ జితేందర్ తెలిపారు. శుక్రవారం వనపర్తి జిల్లా అమరచింత మండలంలో జూరాల పోలీస్ ఔట్ పోస్ట్ కొత్త భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఆధునిక వసతులతో రూ.1.50 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. డ్యామ్ భద్రతను పర్యవేక్షించడంతో పాటు సందర్శకులకు అందుబాటులో ఉండి పారదర్శకంగా సత్వర సేవలు అందిస్తుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ ఆర్. గుర్నాథ్ రెడ్డి , పోలీస్ హౌసింగ్ బోర్డు ఎండీ, ఐజీ రమేశ్‌రెడ్డి, మల్టీజోన్ –--2 ఐజీ సత్యనారాయణ, జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్, వనపర్తి ఏఆర్ ఏఎస్పీ వీరారెడ్డి, వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.