గణపతి నిమజ్జనాలు ప్రశాంతం: డీజీపీ జితేందర్

గణపతి నిమజ్జనాలు ప్రశాంతం: డీజీపీ జితేందర్

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా గణపతి నవరాత్రులు, నిమజ్జనాలు ప్రశాంత వాతావర ణంలో పూర్తయ్యాయని డీజీపీ జితేందర్ తెలిపా రు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని పేర్కొన్నారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి, బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పోలీసుల సూచనలకు అనుగుణంగా వ్యవహరించినందు కు అభినందించారు.

మంగళవారం జరిగిన శోభాయాత్రను లక్డీకపూల్​లోని తన కార్యాయలం లో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెం టర్ ద్వారా పర్యవేక్షించారు. హైదరాబాద్​తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శోభాయాత్రలను పరిశీలించారు. లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్ సహా ఇతర ఐజీల ద్వారా నిమజ్జనాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడారు.

సిటీలో జరిగిన శోభాయాత్రకు 25 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. గణేశ్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ ప్రశాంతంగా ముగిసేందుకు మత పెద్దలతో సమావేశాలు నిర్వహించామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించినట్టు వెల్లడించారు.  

డీజీపీ ఆఫీస్‌‌లో జెండా ఆవిష్కరణ

హైదరాబాద్​లోని డీజీపీ ఆఫీస్‌‌, ఇంటెలిజెన్స్‌‌ హెడ్‌‌ క్వార్టర్స్‌‌లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంటెలిజెన్స్ ఆఫీస్‌‌లో అడిష నల్ డీజీపీ శివధర్‌‌‌‌రెడ్డి, డీజీపీ కార్యాలయంలో ఐజీపీ ఎం.రమేశ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.