- అవుట్ పరేడ్‌లో డీజీపీ జితేందర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర స్పెషల్ పోలీస్‌లో బాక్సింగ్, క్రికెట్ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని డీజీపీ జితేందర్ తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో వసతులు కల్పిస్తామన్నారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని ఫస్ట్ బెటాలియన్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న టీజీఎస్పీ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ శుక్రవారం జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరైన డీజీపీ జితేందర్ మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న 4077 మంది టీజీఎస్పీ సిబ్బందిని డ్రగ్స్‌ను అరికట్టేందుకు,సైబర్ నేరాలను నియంత్రించేందుకు కూడా వినియోగిస్తామన్నారు. జీఆర్పీ, సీఐడీ విభాగాల్లోనూ వారి సేవలు ఉపయోగించుకుంటామన్నారు.