డీజేల విషయంలో త్వరలోనే గైడ్‌లైన్స్ తెస్తం : డీజీపీ

డీజేల విషయంలో త్వరలోనే గైడ్‌లైన్స్ తెస్తం : డీజీపీ

ఉరేఘింపులు, శోభాయాత్రలకు డీజేలు పెట్టడం వల్ల శబ్ధ కాలుష్యంతోపాటు నగర వాసులు కూడా ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు. త్వరలోనే డీజేలపై ఓ గైడ్‌లైన్స్ తీసుకొస్తామని ఆయన చెప్పారు. గణేష్ నిమజ్జనం, జైనూర్ వివాదాలపై డీజీపీ జితేందర్ మంగళవారం ప్రెస్ మీట్ లో మాట్లాడారు. జైనూర్ ఘటన దురదుష్టకరమని విచారం వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితులు చేయి దాటి పోవడంతో ఈ కేసులో 38 మందిని అరెస్ట్ చేశామని, అలసత్వం వహించిన 

ALSO READ | ఫోన్ ట్యాపింగ్ కేసుపై డీజీపీ జితేందర్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గణేష్ నిమజ్జనం, మీలాద్ ఉన్ నభీ వేడుకలు ప్రశాంతంగా పూర్తి చేసేందుకు పోలీస్ డిపార్ట్ మెంట్ బాగా కృషి చేశారని డీజీపీ మెచ్చకున్నారు. బందోబస్తులో15,400 మంది వివిధ జిల్లాల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.- 12వేల మంది ట్రైనీ ఎస్సై, కానిస్టేబుల్ లను కూడా బందోబస్తులో వినియోగించారు. 5,879 నిమజ్జనం పాయింట్లు ఏర్పాటు చేసి.. కంట్రోల్ రూంలు, డీజీపీ కార్యాలయం నుంచి మానిటర్  చేశమని ఆయన తెలియజేశారు.