పోలీస్ శాఖలో పనిచేయడం అంటే ఉద్యోగం కాదు కర్తవ్యం అని అన్నారు తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి. పోలీస్ కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ కు హాజరయ్యారు డీజీపీ జితేందర్ రెడ్డి.ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. మహిళల్లో చైతన్యం రావాలి ఎక్కడా తగ్గకూడదు.. అన్నింట్లో ముందుండాలన్నారు. 2,338 మంది మహిళలు పలు విభగాల్లో ఉద్యోగాల్లో చేరబోతుండటం సంతోషంగా ఉందన్నారు.
పోలీస్ ట్రైనింగ్ చాలా కఠినతరం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చాము అనుకుంటారు. మనో ధైర్యంతో ముందుకు సాగుతేనే సాధిస్తారు. ప్రజలకు పోలీసులు అంటే నమ్మకం కలగాలి. అందరు ఉద్యోగం చేస్తారు కానీ పోలీస్ శాఖ వేరు.. బాధలతో పోలీసులను ఆశ్రయిస్తారు. వారికి న్యాయం చెయ్యాలి. పోలీసింగ్ లో ఛాలెంజ్ లున్నాయి.. సైబర్ క్రైమ్, వయిలెన్స్, ఆర్థిక నేరాల ఎక్కువ పెరిగాయి. కానిస్టేబుల్స్ లో అందరూ ఉన్నత చదువు కున్న వారే. సైబర్ సెక్యురిటి బ్యూరో స్ట్రాంగ్ అయ్యింది. సైబర్ క్రైమ్ కేసుల్లో డబ్బు వాపస్ ఇవ్వటంలో ముందుంది తెలంగాణ. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ సైబర్ కేసులు చేధించటంలో ముందుంది. కొత్త చట్టాలు అమలు చేస్తున్నాం. ప్రజలతో పోలీసులు మమేకమై ఉండాలి... కేసులు పరిష్కారంలో ప్రజల సహకారం ముఖ్యం అని డీజీపీ జితేందర్ రెడ్డి అన్నారు.