
భద్రాచలం, వెలుగు: తెలంగాణ డీజీపీ రవిగుప్తా సోమవారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఈవో రమాదేవి ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. గర్భగుడిలో, లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామి ఆలయాల్లో పూజల తర్వాత అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు. డీజీపీకి ఈవో రమాదేవి ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు. డీజీపీ వెంట ఇంటిలిజెన్స్ అడిషనల్ డీజీపీ శివధరరెడ్డి, ఎస్బీఐజీ సుమతి, ఎస్పీలు రోహిత్ రాజ్, శబరీష్ తదితరులు ఉన్నారు.