హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 47మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రవి గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ కమిషనరేట్లతో పాటు అన్ని జిల్లాల యూనిట్లు, ఏసీబీ విభాగాల నుంచి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే భారీ సంఖ్యలో డీఎస్పీలు, ఇన్ స్పెక్టర్ల బదిలీలు జరిగాయి.