గోదావరిఖని, వెలుగు : రామగుండం పోలీస్ కమిషనరేట్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో పలువురు డీఎస్పీ, ఏసీపీలను బదిలీ చేస్తూ డీజీపీ రవి గుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జైపూర్ ఏసీపీగా పనిచేస్తున్న బి.మోహన్‌ను డీజీపీ ఆఫీస్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. మంచిర్యాల ఏసీపీ బి.తిరుపతిరెడ్డిని ఖమ్మం రూరల్ ఏసీపీగా, బెల్లంపల్లి ఏసీపీ పి.సదయ్యను ఆసిఫాబాద్ డీఎస్పీగా, జగిత్యాల డీఎస్పీ ఎన్.వెంకటస్వామిని రామగుండం సీసీఎస్ ఏసీపీగా
, రామగుండం సీసీఆర్బీ ఏసీపీ వి.మాధవిని కరీంనగర్ సీసీఎస్ ఏసీపీగా, కరీంనగర్ పీటీసీలో పనిచేస్తున్న జి.మహేశ్‌బాబును రాజన్న సిరిసిల్ల ఎస్బీ డీఎస్పీగా, మెట్పల్లి డీఎస్పీ వంగ రవీందర్‌రెడ్డిని మణుగూరు డీఎస్పీగా బదిలీ చేశారు. కాగా వరంగల్ సీసీఆర్బీలో పనిచేస్తున్న గజ్జి కృష్ణను పెద్దపల్లి ఏసీపీగా, కామారెడ్డి డీఎస్పీ రత్నపురం ప్రకాశ్‌ను మంచిర్యాల ఏసీపీగా, హైదరాబాద్ సీసీఎస్‌లో పనిచేస్తున్న ఆరె వెంకటేశ్వర్లును జైపూర్ ఏసీపీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు
జారీ చేశారు.