హైదరాబాద్,వెలుగు: రోడ్డు యాక్సిడెంట్ల్ లో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి డీజీపీ రవి గుప్తా రూ.70 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును అందించారు. గురువారం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇచ్చారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆళ్లగడపకు చెందిన కానిస్టేబుల్ ధర్మపురి శ్రీకాంత్ గత డిసెంబర్‌లో రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోయాడు.
అతని శాలరీ అకౌంట్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఆపరేట్ చేస్తున్నారు. బ్యాంక్ ఇన్సూరెన్స్ ఉండడంతో క్లైయిమ్ చేశారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సర్కిల్ హెడ్ విశాల్ భాటియా జోనల్ హెడ్ జోస్ స్టీఫెన్,రాజీవ్ కుమార్ అధికారులు, ఐజీ స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు.