ప్రతి వాహనదారుడు బాధ్యతగా ఉండాలి డీజీపీ రవి గుప్తా సూచన

ప్రతి వాహనదారుడు బాధ్యతగా ఉండాలి డీజీపీ రవి గుప్తా సూచన

బషీర్ బాగ్, వెలుగు: ట్రాఫిక్​రూల్స్​ఉల్లంఘనతో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని డీజీపీ రవి గుప్తా చెప్పారు. కొందరి నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది బాధపడుతున్నారన్నారు. రోడ్లపైకి వచ్చి ప్రతిఒక్క వాహనదారుడు బాధ్యతగా ఉండాలని కోరారు. ఎన్ఎస్ఎస్(నేషనల్ స్టూడెంట్ సర్వీస్) ద్వారా ట్రాఫిక్ రెగ్యులేషన్ పై అవగాన కల్పిస్తున్నామన్నారు. బషీర్ బాగ్ సీసీఎస్ ఆఫీసులో సోమవారం ఎన్ఎస్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. 

మొత్తం 30వేల మంది స్టూడెంట్లు ట్రాఫిక్ రెగ్యులేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. 20వేల మంది అమ్మాయిలు,10వేల మంది అబ్బాయిలను సెలెక్ట్ చేసినట్లు వివరించారు. స్కూల్ నుంచి కాలేజీ స్థాయి వరకు అందరినీ భాగస్వామ్యం చేస్తున్నట్లు చెప్పారు. ఓవర్ లోడింగ్, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవింగ్, నో హెల్మెట్ డ్రైవింగ్ వంటి అంశాలపై ఒక్కరోజు ట్రైనింగ్ అందిస్తున్నట్లు వెల్లడించారు. ట్రైనింగ్​తీసుకున్న విద్యార్థులు 5 రోజుల పాటు ట్రాఫిక్ రెగ్యులేషన్ విధుల్లో పాల్గొంటారని తెలిపారు. ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగిస్తారన్నారు.