వనదేవతలను దర్శించుకున్న డీజీపీ

మేడారం(తాడ్వాయి): మేడారంలోని సమ్మక్క సారలమ్మలను డీజీపీ రవి గుప్తా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మేడారంలోని పోలీస్‌‌ కమాండ్‌‌ కంట్రోల్‌‌ రూమ్‌‌ను సందర్శించి పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ నిర్వహణ ముఖ్యమని, దీనికి అనుగుణంగా సిబ్బందిని కేటాయించి ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బందులు కలగకుండా పని చేయాలన్నారు. ఇంటెలిజెన్స్ అడిషనల్​డీజీపీ శివధర్ రెడ్డి, వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి,ములుగు ఎస్పీ శబరీశ్, ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం పాల్గొన్నారు.