కొత్త క్రిమినల్ చట్టాలపై డీజీపీ కార్యాలయంలో పోస్టర్ విడుదల

కొత్త క్రిమినల్ చట్టాలపై డీజీపీ కార్యాలయంలో పోస్టర్ విడుదల

మూడు కొత్త క్రిమినల్ చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత మరియు భారతీయ సాక్ష్యా అధినియం జులై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ రవి గుప్తా సోమవారం పోస్టర్లను విడుదల చేశారు. డిజిపి కార్యాలయంలో అధికారులతో కలిసి ఈ పోస్టర్లను డిజిపి ఆవిష్కరించారు. ఈ కొత్త చట్టాలపై ప్రజలకు  అవగాహన కల్పించడానికి ఈ పోస్టర్లు అన్ని పోలీస్ స్టేషన్ల వద్ద ప్రదర్శించబడతాయని ఆయన తెలిపారు. 

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ రైల్వేస్ & రోడ్ సేఫ్టీ ఇంచార్జ్ లీగల్ మహేష్ ఏం  భగవత్, ఐజిపి మల్టీ జోన్ I & II జి. సుధీర్ బాబు, ఏం.రమేష్, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ శింగేనవర్,  ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజ్, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శ్రీ మతి వైజయంతిలు కృషి చేశారని వారిని ఈ సందర్భంగా డిజిపి ప్రశంసించారు. కొత్త చట్టాలపై దర్యాప్తు అధికారులకు మార్గనిర్దేశం చేసేందుకు సిఐడి విభాగంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.