జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభం

జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభం

ఖిలా వరంగల్ (మామునూరు)/ కాశీబుగ్గ, వెలుగు: జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్​ బంక్​ను ఆ శాఖ డీజీపీ సౌమ్య మిశ్రా ప్రారంభించారు. మంగళవారం తిమ్మాపూర్ హవేలి వద్ద భారత్ పెట్రోల్ బంక్ ను  ప్రారంభించి, మాట్లాడుతూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బంకుల్లో విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పిస్తూ వారిలో సత్ప్రవర్తన తీసుకువస్తున్నట్టు చెప్పారు. పర్యవేక్షణ అధికారి కళాసాగర్ ఆధ్వర్యంలో కేంద్ర కారాగారం ఎన్నో రకాల స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతూ ఖైదీల ఆర్థిక అవసరాలకోసం రుణాలు మంజూరు చేస్తున్నామని, కొత్తగా ఏర్పాటు చేసిన బంకులో 8 మంది విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పించినట్లు చెప్పారు. 

అనంతరం సెంట్రల్ జైలును పరిశీలించి, క్షమాభిక్ష అర్జీలను పరిశీలించారు. అక్కడే ఉన్న సీతారామ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో వరంగల్ రేంజ్ డీఐజీ సంపత్, వరంగల్ కలెక్టర్ సత్య శారద, భారత్ పెట్రోలియం రాష్ట్ర రిటైర్డ్ అధికారి నితిన్ సలూకర్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు డీజీపీ మిశ్రా వరంగల్​ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో శేషు భారతి ఆధ్వర్యంలో ఆమెను సత్కరించారు.