శాంతిభద్రతలను దెబ్బతీస్తే సహించం: డీజీపీ

శాంతిభద్రతలను దెబ్బతీస్తే సహించం: డీజీపీ
  • బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటం: డీజీపీ 
  • ఎమ్మెల్యేలు గాంధీ, కౌశిక్ రెడ్డి ఘటనపై ఆరా  
  • రిపోర్టు ఇవ్వాలని సైబరాబాద్ సీపీకి ఆదేశం

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. సున్నితమైన అంశా లతో రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్​లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్‌‌, సైబరాబాద్‌‌, రాచకొండ పోలీస్ కమిషనర్లను ఆదేశించారు.

లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్ సహా మూడు కమిషనరేట్ల సీపీలతో డీజీపీ శుక్రవా రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మె ల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్‌‌‌‌‌‌‌‌ రెడ్డి మధ్య ఘర్ష ణ వాతావరణంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆరా తీశారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సైబరాబాద్ సీపీని ఆదేశించారు. గణేశ్ శోభాయాత్ర నేపథ్యంలో సిటీలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. 

పోలీస్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని చెప్పారు. ఎవరైనా లా అండ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దెబ్బతీయాలని చూస్తే, సహించవద్ద న్నారు. ప్రజలు, పార్టీల నేతలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌‌‌‌‌‌‌‌, ప్రభుత్వ ప్రతిష్టను కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు.