ఏసుక్రీస్తు దయతోనే దేశంలో కరోనా కేసులు తగ్గాయని డీహెచ్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవం వల్లే దేశం అభివృద్ధి చెందిందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న డీహెచ్ శ్రీనివాసరావు...ఈ కామెంట్స్ చేశారు. మానవ మనుగడకు క్రైస్తవ మతమే అభివృద్దిని నేర్పిందన్నారు.
ప్రపంచంలో అభివృద్ధి చెందడానికి క్రైస్తవులే కారణమన్నారు. కరోనా నుంచి పూర్తిగా విముక్తి చెందామని, మంచిని ఆచరించాలని..దానిని అందరూ ముందుకు తీసుకుపోవాలని సూచించారు. ‘భూమి మీద నడియాడిన నేల ఉందంటే అది ఏసుక్రీస్తు మాత్రమే. దీనిని అందరూ అర్థం చేసుకోవాలి. గ్రాఫిక్స్ లేక ఇంకో రూపంలో చూడలేదు. పూర్వీకులు చూశారు. వారు ఇచ్చిన సందేశాన్ని మన వరకు చేరవేస్తున్నారు. భావితరాలకు క్రీస్తు సందేశాన్ని చేరవేయాలి. మంచి ఎక్కడైనా చెప్పాల్సి ఉంటుంది’ అని డీహెచ్ అన్నారు.