శ్రీలంక క్రికెట్ లో దారుణం చోటు చేసుకుంది. మాజీ అండర్ 19 కెప్టెన్ ధామిక నిరోషన్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అతని కుటుంబం చూస్తుండగానే దుండగులు ఈ లంక క్రికెటర్ ను కాల్చి చంపడం షాకింగ్ కు చేస్తుంది. గాలె జిల్లాలోని అంబాలన్‌గోడా ప్రాంతంలో మంగళవారం(జూలై 16) నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్చిన వారు వెంటనే అక్కడ నుంచి పారిపోయారు. అప్పటికే కాల్పులకు గురైన నిరోషన్ అక్కడికక్కడే చనిపోయారు.
ధామిక నిరోషన్ ఎవరు చంపారో తెలియాల్సి ఉంది. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్లుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ మాజీ క్రికెటర్ మృతిపై లంక క్రికెటర్లు దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. ధామిక నిరోషన్ హఠాత్తుగా మరణించడంతో చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కేసును ఛేదించడానికి సహాయం చేయడానికి ఎవరైనా ముందుకు రావాలని అధికారులు రిక్వెస్ట్ చేశారు. ధామిక 2000 ఏడాది శ్రీలంక అండర్ 19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత రెండేళ్లపాటు వన్డేలు, టెస్టులకు ఆడాడు.
Sri Lanka's Former U19 Captain Dhammika Niroshana, Shot Dead 😱
— SportsTiger (@The_SportsTiger) July 17, 2024
📷: ICC#Cricket #SriLankaCricket #DhammikaNiroshana #CricketNews pic.twitter.com/9CozFN5RXD