భారత జట్టులో దురదృష్టవంతుడు ఎవరైనా ఉన్నాడంటే అది కచ్చితంగా చాహలే. టీమిండియా ఆడే ప్రతి ద్వైపాక్షిక సిరీస్‌లో ఉండే ఈ లెగ్ స్పిన్నర్.. ఐసీసీ టోర్నీలకు వచ్చేసరికి జట్టులో చోటు దక్కదు. మేజర్ టోర్నీలు అనగానే సెలక్టర్లు.. అతడిని పక్కన పెడతారు. ఈసారి కూడా అదే జరిగింది. 2023 ఆసియా కప్‌కి ప్రకటించిన జట్టులో చాహల్‌కి చోటు దక్కలేదు. రాబోవు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలోనూ అతను ఆడడం అనుమానమే. ఒకవైపు ఈ బాధలో ఉంటే.. మరోవైపు అభిమానుల సూటి పోటీ మాటలు అతనికి ఎక్కువయ్యాయి.
ఆసియా కప్‌కి సెలక్ట్ కాని చాహాల్.. భార్య ధనశ్రీ వర్మతో కలిసి ఫ్లోరిడాలో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. మియామీ బీచ్‌లో సతీమణి వైట్ బికినీలో అందాలు ఆరబోస్తుంటే.. చాహల్ పొట్టి నిక్కరులో హుషారుగా కనిపిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను ధనశ్రీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వైట్ బికినీలో కనిపించి, కనిపించకుండా అందాలన్నీ ఒలకబోసిన ధనశ్రీ ఫోజులకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు వచ్చేస్తున్నాయి. అయితే ఈ అందాల ఆరబోత చాహల్ మెడకు చుట్టుకుంటోంది. అందాన్ని కాపాడుకోవయ్యా..! చాహల్ అంటూ నెటిజెన్స్.. అతనికి సలహాలిస్తున్నారు. అయితే నెటిజన్ల కామెంట్లు శృతిమించుతున్నాయి. ఇలాంటి ఆరబోతకు అవకాశమిచ్చే.. మరొకరు తన్నుకుపోయేలా చేసుకుంటున్నావంటూ కొందరు, అయ్యర్ ఆసియా కప్ 2023 టోర్నీ క్యాంపులో బిజీగా ఉండటం వల్లే నీకు ఛాన్స్ దొరికిందని మరికొందరు అదోరకంగా కామెంట్లు పెడుతున్నారు.
ధనశ్రీ- అయ్యర్ మధ్య ఏదో నడుస్తుందంటూ..
కొద్దిరోజుల క్రితం వరకు చాహాల్ - ధనశ్రీ వర్మ మధ్య మనస్పర్థలు వచ్చాయని, వీరు విడిపోబోతున్నారంటూ బోలెడు ప్రచారం జరిగింది. అందుకు కారణం శ్రేయాస్ అయ్యర్ అంటూ కథనాలు కూడా వచ్చాయి. వీరిద్దరూ కలిసి ప్రైవేటు పార్టీలకు హాజరైన ఫోటోలు, సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడమే దీనికి కారణం. తాజాగా చాహాల్- ధనశ్రీ జంటగా ఎంజాయ్ చేస్తూ కనిపించటంతో ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పడినట్లే.