మాయమాటలతో ప్రజలను మభ్య పెడుతుండ్రు : ధన్​పాల్​ సూర్యనారాయణ

నిజామాబాద్​ అర్బన్, వెలుగు :  అధికార పార్టీ లీడర్లు మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్​పాల్​ సూర్యనారాయణ విమర్శించారు. గురువారం నగరంలోని 14,15 డివిజన్లలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని వారితో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్​పాల్​ మాట్లాడుతూ..  నగరంలో రెండు నెలల కింద హడావుడి చేసి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా వైకుఠధామాన్ని ప్రారంభించి, ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో లేదన్నారు.

ఎన్నికల్లో లబ్ధి పొందేందుకో, పత్రికల్లో ప్రకటనల కోసమే డాంభిక ప్రచారం చేస్తున్నారే తప్ప, జరిగిన అభివృద్ధి ఏమి లేదన్నారు. రూ.కోట్ల ఖర్చు చేసి నిర్మించిన వైకుంఠధామాన్ని తెరవకుండా, తాళాలు వేసి ఉంచడం ఏమిటని ధన్​పాల్​ప్రశ్నించారు. వెంటనే వైకుంఠధామాలను తెరవాలని లేకుంటే కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున్న ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో లీడర్లు రమేశ్, రంజిత్, లచ్చన్న, విజయ్, లక్ష్మీనారాయణ, సుధీర్, విజయ్, వినోద్​రెడ్డి, ప్రభాకర్,​భాస్కర్, కార్తీక్​ పాల్గొన్నారు.