నిజామాబాద్అర్బన్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ తోనే అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ నిజామాబాద్అర్బన్ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కష్టసుఖాల్లో తాను పాలుపంచుకుంటానని చెప్పారు. అవినీతి బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. తొమ్మదేళ్ల కేసీఆర్ పాలనలో నిజామాబాద్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే మోడీ నాయకత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రచారంలో భాగంగా వివిధ కాలనీల్లోని హోటల్ల వద్ద ధన్పాల్ దోశలు వేశారు. కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్ముతూ ఓటర్లను ఆకర్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.