నిజామాబాద్ అర్బన్, వెలుగు: నిజామాబాద్ నగర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని 21వ డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనతో ప్రజలు విసిగిపోయారని, అధికార పార్టీ నాయకులు చేసిన కబ్జాలు, దౌర్జన్యాలకు చరమగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారన్నారన్నారు. బీఆర్ఎస్ ఆగడాలను అరికట్టే శక్తి ఒక్క బీజేపీకే ఉందన్నారు. ఒకసారి తనకు అవకాశమిస్తే ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానన్నారు.