కోల్‌కతా: బంగారం , వెండి ధరలు పెరిగినప్పటికీ ధన్‌తేరాస్, దీపావళికి ఈ సంవత్సరం రత్నాలకు, నగలకు డిమాండ్ బలంగా ఉంటుందని భావిస్తున్నారు. దీపావళి అమ్మకాల విలువ 30వేల కోట్ల రూపాయలను దాటే అవకాశం ఉందని అంటున్నారు. ధరల పెంపుదల వల్ల వినియోగదారులు బంగారాన్ని మరింత నమ్మదగిన ఆస్తిగా చూస్తారని చెబుతున్నారు. దీపావళికి దేశవ్యాప్తంగా వార్షిక అమ్మకాలు విలువపరంగా 10–-15 శాతం పెరుగుతాయని పేర్కొన్నారు.
స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ రాబడులను అధిగమించి వెండి 40 శాతం కంటే ఎక్కువ రాబడులతో టాప్ పెర్ఫార్మర్‌గా నిలిచింది. బంగారం 23 శాతం ఎగిసింది. అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా బంగారానికి, వెండికి డిమాండ్ కొనసాగుతూనే ఉందని జెమ్స్అండ్జ్యూవలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ తెలిపింది.