హైదరాబాద్, వెలుగు: అగ్రో కెమికల్ కంపెనీ ధనూకా అగ్రిటెక్ లిమిటెడ్ రైతుల కోసం రెండు ఉత్పత్తులను తీసుకొచ్చింది. మొదటిది- పురుగుమందు 'లా నెవో' కాగా, రెండోది బయో-ఎరువు 'మైకోర్ సూపర్'. వ్యవసాయంలో పంటల రక్షణ, దిగుబడి పెంపుదలలో ఇవి విప్లవాత్మక మార్పులు తెస్తాయని ప్రకటించింది.
జాసిడ్, త్రిప్స్, వైట్ ఫ్లై, షూట్ ఫ్రూట్ బోరర్ వంటి అనేక రకాల తెగుళ్లను లానెవో సమర్థవంతంగా నియంత్రిస్తుంది. రసం పీల్చడం, నమలడం, తెగుళ్ల నుంచి రక్షణ ఇస్తుంది. ఆరోగ్యకరమైన పంట, అధిక దిగుబడుల కోసం మైకోర్సూపర్ను తయారు చేశామని ధనూకా పేర్కొంది.