ధనుర్మాసం వచ్చేస్తుంది : ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తే.. లక్ష్మీ కటాక్షం తధ్యం..!

ధనుర్మాసం వచ్చేస్తుంది : ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తే.. లక్ష్మీ కటాక్షం తధ్యం..!

శ్రీ మహాలక్ష్మి, సర్వమాన వాళికి సిరులను కురిపించే తల్లి.. అలాంటి లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఓర్పు... సహనం ఎంతో ముఖ్యం. అన్ని సిరులను ఒసగే లక్ష్మిని శుక్రవారం, గురువారం ఎక్కు వగా పూజించడం పరిపాటి. గురువారానికో ప్రత్యేకత కూడా ఉందని పండితులు చెబుతన్నారు.  కార్తీకమాసం పూజ పరమేశ్వరుడి కటాక్షమైతై.. ధనుర్మాసం పూజ లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. 

గురువారాన్ని లక్ష్మీ వారం అని కూడా అంటారు. ఎందుకంటే ఆ రోజు లక్ష్మికి ప్రీతికరమైన రోజు. గురువారం లక్ష్మీ పూజ చేస్తే అన్ని శుభాలే కలుగుతాయని పెద్దలు అంటారు. కానీ శుక్రవారం  ప్రత్యేకించి అమ్మవారికి పూజలు చేసి దేవి కటాక్షాన్ని పొందుతారు. భక్తులు. అలాగే కార్తీకంలో తులసి చెట్టుకు పూజలు చేసి, ఉసిరి కాయలో దీపాలు వెలిగించి ఆమె దీవెనలు పొందుతారు.కార్తీకంలో తులసి లక్ష్మి పూజ అప్లై శ్వర్యాలను కలిగిస్తుందని భక్తుల విశ్వాసం.

ALSO READ : ఆధ్యాత్మికం: దైవత్వం అంటే ఏమిటి? దైవ దర్శనం ఎప్పుడు కలుగుతుంది ?

 అలాగే ధనుర్మాసం.. ధనుర్మాసం మహావిష్ణువుకి ఎంత ప్రీతికరమో..  శ్రీలక్ష్మి కూడా అంతే. ఎందుకంటే పతి ఎక్కడుంటే పత్ని అక్కడే ఉంటుంది. అందుకే ఆయన శ్రీపతి అయ్యాడు కూడా. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలలో  అనగా తెల్లవారుజామున.. సాయంత్రం దీపారాధన చేస్తే శీఘ్రమే లక్ష్మీకటాక్షం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కానీ ఏ కాలమైనా భక్తితో పూజిస్తే వెంటనే కరుణిస్తుంది.. 

–వెలుగు, లైఫ్​–