Dhanush-Aishwarya Divorce: విడాకుల కోసం కోర్టుకెళ్లిన ధనుష్ దంపతులు.. 18 ఏళ్ళ బంధానికి తెరపడినట్లేనా..?

Dhanush-Aishwarya Divorce: విడాకుల కోసం కోర్టుకెళ్లిన ధనుష్ దంపతులు.. 18 ఏళ్ళ బంధానికి తెరపడినట్లేనా..?

Dhanush-Aishwarya Divorce: కోలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకుంటున్నట్లు 2022 లో ప్రకటించాడు. కానీ ఇతా కారణాలవల్ల ఇప్పటివరకూ కోర్టు విచారణకి హాజరు కాలేదు. దీంతో వీరిద్దరూ విడాకుల విషయంలో మనసు మార్చుకున్నట్లు పలు వార్తలు బలంగా వినిపించాయి. 

కానీ గురువారం(నవంబర్ 21, 2024) చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల విచారణకి  హాజరయ్యారు. ఈ క్రమంలో ధనుష్, ఐశ్వర్య కోర్టు నుంచి బయటికొస్తున్న సమయంలో విలేఖర్ల కంట పడ్డారు. అయితే విడాకుల విషయం గురించి ప్రశ్నించినప్పటికీ స్పందించకుండా వెళ్లిపోయారు. విడాకుల విషయంలో తీర్పు నవంబర్ 27కి వాయిదా వేశారు. 

అయితే ధనుష్ మరియు ఐశ్వర్య 2004 లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయిన తర్వాత దాదాపుగా 18ఏళ్ళ తర్వాత విడాకులు తీసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఐశ్వర్య రజనీంకాంత్ తన భర్త ధనుష్ హీరోగా నటించిన 3 అనే సినిమాకి దర్శకత్వం వహించి తనలోని దర్శకత్వ ప్రతిభ నిరూపించుకుంది. 

అంతేగాకుండా సింగర్ గా కూడా స్వరం అందించింది. ప్రస్తుతం తన తండ్రి రజనీకాంత్ హీరోగా నటిస్తున్న "లాల్ సలామ్" అనే సినిమా కి దర్శకత్వం వహిస్తోంది. ఈ సినిమా పలు కారణాలవల్ల ఆగిపోయిందని గతంలో వార్తలు వినిపించినప్పటికీ మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయినట్లు సమాచారం.

ఇక ధనుష్ విషయానికొస్తే తెలుగు ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న "కుబేర" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కీలకపాత్రలో హీరో కింగ్ నాగార్జున నటిస్తుండగా నేషనల్ క్రష్ రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ధనుష్ హీరోగా మాత్రమే కాకుండా మెగా ఫోన్ పట్టి దర్శకత్వం కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం ఇడ్లీ కడాయి అనే సినిమాలో హీరోగా నటిస్తూ తానే దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు చెన్నై పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.