D56: ధనుష్ కొత్త సినిమా అనౌన్స్.. కత్తిపై మానవ పుర్రె.. డైరెక్టర్ ఎవరంటే?

D56: ధనుష్ కొత్త సినిమా అనౌన్స్.. కత్తిపై మానవ పుర్రె.. డైరెక్టర్ ఎవరంటే?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే, నటుడిగా రాణిస్తున్నాడు. ఇటీవలే రాయన్, నెక్ వంటి మూవీస్ తో దర్శకుడిగా తన మార్క్ చూపించాడు. చూపించాడు.

ఈ క్రమంలోనే కుబేర, ఇడ్లీ కడై సినిమాల్లో హీరోగానూ వరుస షూటింగ్లో పాల్గొంటున్నాడు. లేటెస్ట్గా ధనుష్ మరో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. ధనుష్ తన 56వ సినిమాను విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్‌తో (Mari Selvaraj) చేయనున్నాడు.

ఇందుకు సంబంధించిన D56 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు హీరో ధనుష్. ఈ పోస్టర్‌లో మానవ పుర్రె ఆకారంలో ఉన్న కత్తి (కర్ణుడిని గుర్తు చేస్తుంది). “మూలాలు గొప్ప యుద్ధానికి నాంది పలికాయి ” అని పోస్టర్‌లో ఉంది. ఫస్ట్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. 

గతంలో మారి సెల్వరాజ్తో కర్ణన్ అనే సోషల్ యాక్షన్ డ్రామా మూవీ చేశాడు ధనుష్. ఈ సినిమా రిలీజై (2021 ఏప్రిల్ 9)తో 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా మరోసారి ఈ వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నట్లు ప్రకటించారు.ఈ సినిమాను వెల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఇషారి గణేష్ నిర్మిస్తున్నారు. 

Also Read:-ఒట్టేసి చెప్పినట్టే వచ్చేసాడు.. మనోజ్ బాజ్‌పేయ్తో ఆర్జీవీ హార్రర్ థ్రిల్లర్

ఇకపోతే ధనుష్ తన దర్శకత్వంలో వస్తోన్న ఇడ్లీ కడై నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో అరుణ్ విజయ్, షాలిని పాండే, ప్రకాష్ రాజ్, రాజ్ కిరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. వుండర్‌బార్ ఫిల్మ్స్ మరియు డాన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ పంపిణీ చేస్తుంది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తోన్న కుబేర జూన్ 20న రిలీజ్ కానుంది.