
కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) హీరోగా థియేటర్లలోకి వచ్చిన లేటెస్ట్ పీరియాడిక్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’(Captain Miller). తన కెరీర్‌లోనే హయ్యస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించాడు. టీజర్,ట్రైలర్తో ఆడియాన్స్ను ఇంప్రెస్ చేసిన మేకర్స్.. సినిమాతో బాగా డిస్సప్పాయింట్ చేశారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా తమిళ వెర్షన్ థియేటర్‌లోకి రాగా..తెలుగులో జనవరి 25న వచ్చింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతుంది. ఫిబ్రవరి 9 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో కెప్టెన్ మిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లో కెప్టెన్ మిల్లర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.100 కోట్లకుపైగా గ్రాస్‌ను, రూ.45 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ముందునుంచే ఆడియన్స్ లో ఈ సినిమాపై ఉన్న బజ్ కారణంగా మూడు వందల కోట్ల కలెక్షన్స్‌ను ఈజీగా దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
కానీ,ఈ సినిమాలో ధనుష్ నటన ఎప్పటిలాగే ఆకట్టుకున్నప్పటికీ..బలమైన ఎమోషన్స్ లేకపోవడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అందుకే కెప్టెన్ మిల్లర్ రిలీజైన నెల లోపే ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైంది.
1930 - 40 లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ ఇంపార్టెంట్ రోల్స్ చేశారు.ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించింది