కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) 50వ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీకి రాయాన్(Raayan) అనే టైటిల్ను కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అయితే రాయన్ మూవీకి ధనుష్ డైరెక్ట్ చేస్తుండటంతో పాటు హీరోగా నటిస్తున్నాడు.
అయితే రాయాన్ సినిమా నార్త్ చెన్నై కథాంశంతో ధనుష్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కథ, స్క్రీన్ ప్లే విషయంలో హీరో ధనుష్ చాలా జాగ్రత్తలు తీసుకొని..ఆడియన్స్కి కొత్త యాంగిల్లో థ్రిల్ ఇవ్వనున్నట్లు సమాచారం. గతేడాది డిసెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు ధనుష్ ప్రకటించిన విషయం తెలిసిందే.
లేటెస్ట్గా రిలీజ్ చేసిన రాయాన్ ఫస్ట్ లుక్ పోస్టర్లో ధనుష్ రక్తంతో తడిచిన చేతితో పిడికిలి బిగించి భీకరంగా కనిపిస్తున్నాడు.ఇక అతని వెనుక ఉన్న హీరో సందీప్ కిషన్ మరియు కాళిదాస్ జయరామ్ చేతిలో కత్తులు ఉన్నాయి. రాయాన్ పోస్టర్ లోనే ఇంత హింస చూపిస్తుంటే..ఇక టీజర్ ట్రైలర్ ఎలా ఉండనుందో ఫ్యాన్స్ ఊహించేసుకుంటున్నారు. త్వరలో ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో దుసారా విజయన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్.జె.సూర్య, అపర్ణ బాలమురళి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ, జాకీ ఆర్ట్ డైరెక్టర్. పీటర్ హైన్ ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్ గా వ్యవహరించాడు. ప్రస్తుతం ధనుష్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల మూవీలో నటిస్తున్నాడు.
RAAYAN #D50 @sunpictures @arrahman pic.twitter.com/DdDNlJPVxw
— Dhanush (@dhanushkraja) February 19, 2024