
కోలీవుడ్ స్టార్ ధనుష్.. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం అతను ఓ ఇంటర్నేషనల్ మూవీలోనూ నటించాడు. ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’పేరుతో 2019లో ఇంగ్లీష్, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.
మార్చి 26 నుంచి ఆహా ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కాబోతోంది. ‘ఆహా గోల్డ్’సబ్‌స్క్రిప్షన్ ఉంటే ఈ నెల 25 నుంచే చూడొచ్చని సదరు సంస్థ వెల్లడించింది. ఈ సినిమా ఇప్పటికే యాపిల్ టీవీ+లో స్ట్రీమింగ్ అవుతోంది.
ముంబై మురికి వాడల్లో పుట్టిన లావష్ పటేల్ అనే ఫకీర్‌గా ధనుష్ ఇందులో నటించాడు. ఫేక్ డాక్యుమెంట్స్‌తో పారిస్ వెళ్లిన ఫకీర్.. అక్కడి నుంచి అనుకోకుండా వాడ్రోబ్‌లో స్పెయిన్, యూకే, ఇటలీ, లిబియాలకు వెళ్తాడు. తను ప్రేమించిన యువతి కోసం తిరిగి పారిస్ ఎలా వచ్చాడనేది మెయిన్ కాన్సెప్ట్.
Also Read : ‘లూసిఫర్2’కి మోహన్ లాల్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే?
Dhanush’s #TheExtraordinaryJourneyOfTheFakir is streaming from Mar 26 on AHA. pic.twitter.com/s2gMrbxDFL
— Christopher Kanagaraj (@Chrissuccess) March 22, 2025
ఇందులో ధనుష్ మినహా మిగిలిన వాళ్లంతా విదేశీ నటీనటులే. ఇదే టైటిల్‌తో రొమెయిన్ ప్యూర్టోలస్ రాసిన నవల ఆధారంగా కెనడాకు చెందిన దర్శకుడు కెన్ స్కాట్ దీన్ని తెరకెక్కించారు.
కేవలం 92 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా సుమారు ఆరేళ్ల తర్వాత ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఫ్రెంచ్ నవల ఆధారంగా కెన్ స్కాట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హాలీవుడ్ నటులు బెన్ మిల్లర్, ఎరిన్ మోరియాట్రి తదితరులు కీలక పాత్రలు పోషించారు.