Danush : ధనుష్ ఇడ్లీ కడై మూవీ షూట్ కంప్లీట్

Danush : ధనుష్ ఇడ్లీ కడై మూవీ షూట్ కంప్లీట్

ఓ వైపు హీరోగా,  మరోవైపు దర్శకుడిగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు ధనుష్.  గత ఏడాది ‘రాయన్, రీసెంట్‌‌‌‌‌‌‌‌గా ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాలను డైరెక్ట్ చేసిన ధనుష్.. ప్రస్తుతం ‘ఇడ్లీ కడై’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. తను హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని తెలియజేశారు మేకర్స్. బ్యాంకాక్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఫైనల్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌తో మొత్తం షూట్ కంప్లీట్ అయ్యింది. ధనుష్‌‌‌‌‌‌‌‌కి నటుడిగా ఇది 52వ సినిమా కాగా, దర్శకుడిగా నాలుగో సినిమా. నిత్యా మీనన్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. రాజ్ కిరణ్, అరుణ్ విజయ్,  షాలిని పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. వండర్ బార్ ఫిలిమ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్స్‌‌‌‌‌‌‌‌పై  ధనుష్, ఆకాష్ భాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ 1న వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా సినిమా విడుదల కానుందని ప్రకటించారు. తాజాగా ఈ మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్‌‌‌‌‌‌‌‌ను చింతపల్లి రామారావు దక్కించుకున్నారు.  ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ధనుష్​ హీరోగా ‘కుబేర’ చిత్రం త్వరలోనే  ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మారి సెల్వరాజ్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యాడు.