![Dhanush: దర్శకుడిగా ధనుష్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ట్రైలర్ తోనే సినిమా చూపించాడు మామ](https://static.v6velugu.com/uploads/2025/02/dhanush-latest-movie-jabilamma-neeku-antha-kopama-trailer-released_wWpytQkHsE.jpg)
కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) హీరోగా, దర్శకుడిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓ పక్క హీరోగా పెద్ద సినిమాలు చేస్తూనే డైరెక్టర్ సినిమాలు చేస్తున్నాడు. లేటెస్ట్గా ధనుష్ దర్శకుడిగా తెరకెక్కించిన మూవీ ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’. పవీష్, అనిఖ సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటించారు.
ట్రయాంగిల్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్‌లో రానున్నఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇది చాలా నార్మల్ స్టోరీ అంటూ స్టార్ట్ చేస్తూనే ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా మలిచాడు డైరెక్టర్ ధనుష్. 2 నిముషాలకి పైగా ఉన్న ఈ ట్రైలర్ లోని డైలాగ్స్, కామెడీ సీన్స్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్గా సాగాయి.
Also Read : యానిమల్ ఆరాధ్య మతిపోయే ఫొటో సిరీస్
ఇక చివర్లో 'జాలీగా రండి.. జాలీగా వెళ్లండి' అంటూ ధనుష్ చెప్పిన డైలాగ్ ట్రైలర్లో ఆకట్టుకుంటోంది. ఈ మూవీని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తెలుగులో రిలీజ్ చేస్తుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్నందిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 21న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది.
ప్రస్తుతం ధనుష్ డైరెక్టర్‌గా ‘ఇడ్లీ కడాయ్’ (Idli Kadai) అనే సినిమా చేస్తున్నాడు. నటుడిగా ఇది 52వ సినిమా. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాష్ భాస్కరన్ మొదటి ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
గ్రామీణ నేపథ్యంలో ఇడ్లీ కొట్టు పెట్టుకుని బ్రతికే జంటగా ధనుష్, నిత్యా మీనన్ కనిపిస్తున్నారు. ఈ జంట 2022లో వచ్చిన ‘తిరు' మూవీలో నటించారు. అలాగే డైరెక్టర్ శేఖర్ కమ్ములతో కుబేర మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది.