టాలెంటెడ్ యాక్టర్ ‘ధనుష్’ న్యూ మూవీ ‘నానే వరువేన్’ (Naane Varuven) టీజర్ విడుదలకు డేట్ కన్ఫాం చేశారు. ‘తిరుచిత్రంబళం’ (Thiruchitrambalam) మూవీ ఘన విజయం అనంతరం ధనుష్ నటిస్తున్న ఈ సినిమా టీజర్ సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ను ఇవ్వాలని ఆయన ఫ్యాన్స్ కోరుతూ వస్తున్నారు. దీంతో ధనుష్ ట్వీట్ ద్వారా అప్ డేట్ ఇచ్చారు.
సినిమా టీజర్ డేట్ ను ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోస్టర్ లో ధనుష్ విభిన్న లుక్స్ తో ఆకట్టుకుంటున్నాడు. హీరోగా, విలన్ గా రెండు పాత్రలను పోషించాడు. వి. క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మించగా సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ చివరి వారంలో విడుదల చేయాలని ప్లాన్స్ చేస్తున్నారు. ధనుష్ విషయానికి వస్తే.. ఆయన నటించిన సినిమాలు తెలుగులో డబ్బింగ్ లో విడుదలవుతూ వస్తున్నాయి. వరుస సినిమాలతో ఆయన బిజీగా మారిపోయారు.
Naane varuven Teaser update pic.twitter.com/GwZtZSTPfE
— Dhanush (@dhanushkraja) September 13, 2022