Raayan Day 1 Collection: రాయన్ ఫస్ట్డే ఇండియా వైడ్ కలెక్షన్స్..హిందీ కంటే తెలుగు వెర్షన్కే ఎక్కువ

Raayan Day 1 Collection: రాయన్ ఫస్ట్డే ఇండియా వైడ్ కలెక్షన్స్..హిందీ కంటే తెలుగు వెర్షన్కే ఎక్కువ

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేసిన మూవీ ‘రాయన్’(RAAYAN). కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం జూలై 26న థియేట‌ర్ల‌లో రిలీజ్ అయింది. ధనుష్ కెరీర్‌లో 50వ సినిమాగా వచ్చిన రాయన్ థియేటర్లలో రిలీజై  ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద రాయన్‌కు ఫస్ట్ డే కలెక్షన్స్ బాగానే వచ్చినట్లు తెలుస్తోంది. 

ట్రేడ్ నిపుణుల అంచనాల ప్రకారం..రాయన్కు ఫస్ట్ డే ఒక్క ఇండియాలోనే రూ.12.5 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ వసూళ్లలో తెలుగు వెర్షన్ నుంచి రూ.1.5 కోట్లు రాగా తమిళ వెర్షన్‌కు రూ.11 కోట్లు వచ్చాయి. కాగా హిందీ వెర్షన్ కలెక్షన్స్ తెలియాల్సి ఉంది. ఎందుకంటే,ఈ మూవీ హిందీ ఆడియన్స్ను అంతగా మెప్పించలేకపోవడం వల్ల చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. 

ఇక సెకండ్ డే (శనివారం) నాడు రాయన్ మూవీకి రూ.28 లక్షల వరకు ఇండియా నెట్ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే, ఇది కేవలం ఇప్పటి వరకు అన్ని షోలకు బుక్ అయిన టికెట్స్ ఆధారంగా చెప్పిన సమాచారం. కానీ, ఆఫ్‌లైన్‌లో మరింతగా ప్రేక్షకులు పెరిగే అవకాశం ఉంది. అందుకు కారణం లేకపోలేదు. ధనుష్ కి కోలీవుడ్ హీరో అయినా తెలుగులో భారీగా ఫ్యాన్స్ ఉన్నారు.  

ఇక రాయన్ అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు చూసుకుంటే..అడ్వాన్స్ బుకింగ్‌లో 4,36,704 టిక్కెట్లు విక్రయించబడగా రూ. 6.15 కోట్లు వసూలు చేసింది. రాయన్ ఫస్ట్ డే కలెక్షన్స్ తో ధనుష్ నటించిన కర్ణన్ యొక్క ఫస్ట్ డే కలెక్షన్ రూ.10.40 కోట్లను అధిగమించింది. దీంతో రాయన్ మూవీ కర్ణన్ రికార్డును బద్దలు కొట్టింది. ఇక ధనుష్ కెరీర్లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రాయన్ నిలిచింది. ప్రస్తుతం వీకెండ్ ఉండటంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. అందులోను పోటీగా చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం రాయన్ కు కలిసొచ్చే అంశం.