
స్టార్ హీరో ధనుష్ దర్శకుడిగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’.తమిళంలో 'ఎన్ మెల్ ఎన్నడి కోబమ్' (NEEK).పవీష్, అనిఖ సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 21న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది.
దాదాపు రూ.15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ.. కనీసం రూ.10 కోట్లు కూడా వసూళ్లు చేయకపోయింది. దాంతో నెల రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కి వస్తోంది. ఈ శుక్రవారం (మార్చి 21) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ అధికారిక పోస్టర్ను రిలీజ్ చేస్తూ స్ట్రీమింగ్ డేట్ వెల్లడించారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులకి ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి.
#NEEKonPrime from March 21st onwards… pic.twitter.com/djVf6SfGTE
— Dhanush (@dhanushkraja) March 18, 2025
ఫ్రెండ్షిప్, లవ్, బ్రేకప్ వంటి విషయాల్ని హైలెట్ చేస్తూ ఎమోషన్స్ కి తగ్గట్టుగా సీన్స్ రాసుకుని స్టోరీని చక్కగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు ధనుష్ సక్సెస్ అయ్యాడు. కానీ, కమర్షియల్గా సక్సెస్ సాధించలేకపోయాడు. అయితే, ఈ మూవీకి పోటీగా వచ్చిన ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ (Dragon) సినిమా భారీ హిట్ కొట్టింది. ఇదే పెద్ద మైనస్ గా మారింది.ఫిబ్రవరి 21న థియేటర్స్కి వచ్చిన డ్రాగన్..వరల్డ్ వైడ్గా రూ.100 కోట్ల గ్రాస్ దాటి రూ.150 కోట్లకి పరుగుతీస్తుంది. డ్రాగన్ మూవీ సైతం మార్చి 21 నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది.
కథేంటంటే:
మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన హీరో ప్రభు(పవీష్ నారాయణ్) చెఫ్ అయ్యి తన వంటల రుచి అందరికీ చూపించి పెద్ద హోటల్ జబ కొట్టి సెటిల్ అవ్వాలనుకుంటాడు. ఓ పార్టీలో అనుకోకుండా నీలా (అనికా సురేంద్రన్)పరిచయం ఏర్పడి ప్రేమకి దారితీస్తుంది. దీంతో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు.. కానీ నీలా తండ్రి (శరత్ కుమార్) వీరి పెళ్ళికి ఒప్పకోకపోగా ప్రభు నచ్చలేదంటూ అవమానిస్తాడు.. ఆ తర్వాత బ్రేకప్ అయ్యి ఎవరిలైఫ్ లో వాళ్ళు బిజీగా ఉంటారు.. ఆ తర్వాత ప్రభుకి తన స్కూల్ ఫ్రెండ్ ప్రీతీ(ప్రియా ప్రకాష్ వారియర్) పెళ్లి సంబంధం వస్తుంది. ప్రభు కూడా ఒకే చెబుతాడు. కానీ ప్రభు పెళ్లి జరిగే సమయానికి నీలా కూడా తన పెళ్లి కార్డుని ప్రభుకు పంపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది..? చివరికి ప్రభు పెళ్లి ప్రీతితో జరిగిందా.. లేక నీలాతో జరిగిందా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.