Ilaiyaraaja Biopic Official : ఇళయరాజా బయోపిక్లో ధనుష్..డైరెక్టర్ ఎవరంటే?

ఇళయరాజా (Ilaiyaraaja)..ఈ పేరు తలవకుండా ఇండియన్ సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడటం చాలా కష్టం. తన సంగీతంతో యావత్ ప్రపంచాన్ని మంత్రముగ్దులను చేశారు. ఇప్పటికే 1400 వందలకు పైగా సినిమాలకు సంగీతం అందించి రికార్డ్ క్రియేట్ చేశారు ఈ సంగీత జ్ఞాని. ఈ ప్రయాణంలో ఆయన సాధించిన విజయాలు, ప్రశంసలు, అవార్డులు ఎన్నో ఎన్నెన్నో. ఆలాంటి మహానుభావుడి నిజ జీవితంపై సినిమా వస్తుందని చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. 

తాజాగా మేకర్స్ ఈ సినిమాని అఫీషియల్గా అనౌన్స్ చేసారు. బుధవారం (మార్చి 20న) చెన్నై లో ఇళయరాజా, హీరో కమల్ హాసన్ (Kamal Haasan) సహా ధనుష్ తదితరుల సమక్షంలో ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

ALSO READ :- RC16PoojaCeremony: గ్రాండ్గా ప్రారంభమైన RC16..బుచ్చిబాబు మార్క్ టైటిల్!

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ధనుష్ ఇళయరాజా పాత్రలో నటిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ది కింగ్ అఫ్ మ్యూజిక్తో వస్తోన్న ఈ చిత్రాన్ని దర్శకుడు అరుణ్ మాతేశ్వరణ్ తెరకెక్కిస్తున్నాడు. ఈయన ధనుష్ గత చిత్రం కెప్టెన్ మిల్లర్ ని డైరెక్ట్ చేశాడు. 

ఇళయరాజా బయోపిక్ (Ilaiyaraaja Biopic)ని  పీకే ప్రైమ్ ప్రొడక్షన్ వారు అలాగే మెర్క్యూరీ మూవీస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.