స్టార్ హీరో.. తెలుగు, తమిళంలో అందరికీ తెలిసిన హీరో.. అంతకు మించి సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు కూడా.. అతనే ధనుష్. సహజంగా హీరో అంటే ఎప్పుడూ అందంగా.. నీట్ గా కనిపిస్తారు. ధనుష్ మాత్రం అందుకు భిన్నంగా. ఇంట్లో ఎలా ఉంటారో నలుగురిలోనూ అలాగే ఉంటారు. సినిమాల్లోనూ పెద్దగా మేకప్ ఉండదు.. సహజంగానే ఉంటుంది అతని బాడీ లాంగ్వేజ్. అంతుకు మించి తను ధరించే దుస్తులు సైతం అతి సాధారణంగా ఉంటాయి..
హీరో ధనుష్ గుండు కొట్టించుకున్నారు. తిరుమల దర్శనానికి వచ్చిన ఆయన.. తన మొక్కు చెల్లించుకున్నారు. హీరోలు ఎవరైనా తిరుమల వస్తే.. భారీ హంగామాతో.. హడావిడి నడుస్తుంది. అందుకు భిన్నంగా హీరో ధనుష్.. సాధారణ భక్తునిగా కొండకు వచ్చారు. గుండు కొట్టించుకుని వేంకటేశ్వరస్వామికి మొక్కు చెల్లించుకున్నారు. హీరో అనగానే రెగ్యులర్ గా సినిమాలు ఉంటాయి.. అలాంటప్పుడు గుండు కొట్టించుకోవటం అనేది చాలా చాలా అరుదు.
హీరో ధనుష్ మాత్రం.. అవేమీ ఆలోచించలేదు. స్వామి వారికి ఎంతో భక్తితో.. తల వెంట్రుకలు ఇచ్చారు. మీసాలు అయితే తీయలేదు కానీ.. జుట్టు ఇచ్చారు.. గడ్డం ఇచ్చారు. కొన్నాళ్లుగా హీరో ధనుష్ ఫుల్ హెయిర్ తోపాటు పొడవాటి గడ్డెం మొయిన్ టెన్ చేయిస్తున్నారు. సార్ మూవీ ప్రమోషన్స్ లోనూ ఇలాగే కనిపించారు. అందరూ అనుకున్నది ఏంటంటే.. కొత్త సినిమా కోసం ఇలా మేకోవర్ అవుతున్నారు అనుకున్నారు.. వాస్తవం ఏంటంటే.. వేంకటేశ్వరస్వామికి మొక్కు ఉన్నది అనేది ఇప్పుడు స్పష్టం అయ్యింది.
తిరుమల కొండపై హీరో ధనుష్ గుండుతో ఉన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంత హీరో అయినా.. ఏడుకొండలు ఎక్కితే మాత్రం భక్తులుగా మారిపోతారు.. దేవుడు అంటే భయం, భక్తి ఉండాలి అంటారు కదా.. అదే ఇప్పుడు ధనుష్ వ్యవహారంలో జరిగింది. ఏదిఏమైనా ధనుష్ అనుకున్నది నెరవేరితేనే కదా శ్రీవారికి తలనీలాలు ఇచ్చింది..