నేడు ఐదుగురు కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ

హైదరాబాద్, వెలుగు: ఐదుగురు కలెక్టర్లతో ధరణి కమిటీ బుధవారం సమావేశం కానుంది. ఉదయం 10.30 గంటలకు సెక్రటేరియెట్​లో ధరణి కమిటీ కన్వీనర్, సీసీఎల్ఏ నవీన్​ మిట్టల్​అధ్యక్షతన నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సమావేశం కానున్నారు.  ఈ భేటీలో ధరణిలో ఉన్న సమస్యలపై చర్చించనున్నారు. చెక్​లిస్ట్​, ఎలాంటి విధానం ఫాలో చేయాలి ?  ఎమ్మార్వో, ఆర్డీవో ఎంక్వైరీ రిపోర్టులు, లీగల్​ ఫ్రేమ్​ వర్క్​, నిజామాబాద్​లో చేపట్టిన  భూభారతి స్టేటస్​ రికార్డు, ధరణిలో సమస్యలకు పరిష్కారం చూపించాల్సిన అంశాలపై ఈ కమిటీ కలెక్టర్ల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనుంది. 

టెర్రాసిస్ ​కంపెనీ వస్తలే

ధరణి పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహణ చూస్తున్న టెర్రాసిస్​ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీ  ధరణిపై ఏర్పాటైన కమిటీకి సహకరించట్లేదు. సమస్యలపై స్టడీకి పిలిచినా కంపెనీ స్పందించలేదని తెలిసింది. ఇప్పటివరకు మూడుసార్లు సమావేశమై కమిటీ వివిధ అంశాలపై చర్చించింది. అయితే  కంపెనీ ప్రతినిధులను కమిటీ  పిలిచింది. కానీ ఆ కంపెనీ స్పందించట్లేదు. మూడుసార్లు సమాచారం ఇచ్చినా  రెస్పాండ్ అవ్వలేదు.