
భూ ఆక్రమణ దారులకు సహకరించిన కరీంనగర్ కలెక్టరేట్ మాజీ ధరణి కో ఆర్డినేటర్ ఎల్లంకి బుచ్చిరాజును కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు బుచ్చిరాజును జైలుకు తరలించారు. ఇదే కేసులో కొత్తపల్లి మాజీ ఎమ్మార్వో చిల్ల శ్రీనివాస్, అతని బినామీ, సహకరించిన మరో 12 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
కరీంనగర్ సీతారాంపూరుకు చెందిన బొంతల రఘు రాజు అనే వ్యక్తి భూమిని నకిలీ ధృవపత్రాలు సృష్టించి కాజేసినట్లు వీరిపై అభియోగాలు ఉన్నాయి. నిందితుల్లో ఒకరైన A12 గా వున్న కరీంనగర్ భగత్ నగర్ కి చెందిన ధరణి మాజీ ఆపరేటర్ ఎల్లంకి బుచ్చిరాజు ఇవాళ అరెస్టు అయ్యారు. ఇంకా ఈ కేసులో ఎంత మంది ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.