సంగారెడ్డి జిల్లా: జిల్లాలోని అమీన్ పూర్ మండల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ధరణి ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్ మన్నె సంతోష్ లు ఓ రైతుకు పాస్ బుక్ ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేసి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడకు చెందిన వెంకటేశం యాదవ్ మామ ఇటీవల మృతి చెందాడు. 1ఎకరా 20 గుంటల భూమిని ధరణిలో తన అత్తగారైన జయమ్మ పేరును చేర్చాలని అమీన్ పూర్ తహశీల్దార్ కార్యాలయంలో వెళ్లాడు. రూ.30 వేలు లంచం ఇవ్వాలని ధరణి ఆపరేటర్ చాకలి అరుణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ మన్నె సంతోష్ డిమాండ్ చేశారు.
బాధితుడు వెంకటేశం ఏసీబీ అధికారులను సంప్రదించాడు. అరుణ్, జూనియర్ అసిస్టెంట్ మన్నె సంతోష్ ఇళ్లల్లోనూ సోదాలు చేస్తామన్నారు. వీరిద్దరిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ వెల్లడించారు.
#ACB Officials caught "M. Santhosh - Jr. Asst & Ch. Arun Kumar - Dharani Operator (Out Soucing)" at O/o Ameenpur Tahsildar Office, Sangareddy Dist. for demanding and accepting the #bribe amount of Rs. 30000/- "for forwarding succesion file to the Tahasildar".@CVAnandIPS
— ACB Telangana (@TelanganaACB) August 1, 2024
ఒక… pic.twitter.com/6KVqMMsSD2