హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మూడ్రోజుల పాటు ధరణి పోర్టల్ సేవలు నిలిచిపోనున్నాయి. గురువారం సాయంత్రం నుంచే ధరణి పోర్టల్స్తంభించింది. ధరణి పోర్టల్ బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీ టెర్రాసిస్నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీకి ఇటీవలే అప్పగించారు.
పూర్తి డేటాను ఎన్ఐసీకి ట్రాన్సిస్ట్ చేస్తూ డేటాబేస్ వెర్షన్ ను అప్ గ్రేడ్ చేస్తున్నారు. దీంతో ధరణి పోర్టల్ లో సేవలు నిలిపివేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 16వ తేదీ ఉదయం కల్లా ధరణి పోర్టల్ అప్ గ్రేడ్ ప్రక్రియ ముగిసి యథావిధిగా పనిచేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.