ఏసీబీకి చిక్కిన ధరణి సిస్టం ఆపరేటర్

ఒ రైతు నుండి లంచం తీసుకుంటూ ధరణి సిస్టం ఆపరేటర్ ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన కౌడిపల్లి చోటుచేసుకుంది. మెదక్ జిల్లా కౌడిపల్లి తహసిల్దార్ కార్యాలయంలో ఇవాళ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో వేణు అనే అధికారి పట్టుబడ్డాడు. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పోచయ్య అనే రైతు.. సర్వేనెంబర్ 357లో 10 గుంటల భూమి రిజిస్ట్రేషన్ కోసం తహసిల్దార్ ఆఫీసుకు వెళ్లాడు. అక్కడ ధరణి ఆపరేటర్ 20 వేల రూపాయలు ఇవ్వాలని రైతును డిమాండ్ చేశాడు. వేణు తనకు సంబంధించిన ఒ వ్యక్తికి బయట ఉంటాడు అతనికి 20 వేల రూపాయలు ఇవ్వమని చెప్పగా.. రైతు ఆ డబ్బును ఇచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరినీ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.