33 జిల్లాల్లో మా భూమి రథయాత్ర : విశారదన్ మహరాజ్

33 జిల్లాల్లో మా భూమి రథయాత్ర : విశారదన్ మహరాజ్
  • ధర్మ సమాజ్ పార్టీ స్టేట్ చీఫ్ విశారదన్ మహరాజ్ వెల్లడి

అంబర్​పేట, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడిత ప్రజానికాన్ని విముక్తి పరిచి రాజ్యం సాధించుకోవడమే ధ్యేయంగా 33 జిల్లాల్లో లక్ష కిలోమీటర్ల ‘మా భూమి రథయాత్ర’ చేపట్టనున్నట్లు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ వెల్లడించారు. శనివారం ఆయన బర్కత్​పురాలోని పార్టీ స్టేట్​ఆఫీసులో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాలను ఏప్రిల్​ 14 నుంచి చేపట్టనున్న ‘మా భూమి రథయాత్ర’  ద్వారా వివరిస్తామన్నారు. 

బడ్జెట్లో విద్య, వైద్య , ఉపాధి రంగాలకు 30% చొప్పున నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా కార్యచరణ మొదలు పెట్టకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలను చైతన్యం చేసేందుకు అదిలాబాద్ నుంచి మొదలుకొని చివరగా హైదరాబాద్ చేరుకొని జింఖానా గ్రౌండ్ లో మహాసభ నిర్వహిస్తామని వివరించారు.