ఎల్బీనగర్, వెలుగు: ధర్మ సమాజ్ పార్టీ(డీఎస్పీ) ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఆవిర్భావ సభ కొత్తపేటలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో మంగళవారం జరగనుంది. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర చీఫ్ విశారదన్ మహరాజ్ హాజరుకానున్నారు.
ఉదయం లోయర్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ భవన్ నుంచి ప్రారంభం కానున్న ర్యాలీ..ఎల్బీ నగర్ మీదుగా కొత్తపేటలోని జగ్జీవన్ రామ్ భవన్ వరకు కొనసాగనుంది. సభకు జిల్లాల్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకావాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.