రూ. 8 కోట్లు పెట్టినా.. పానాలు దక్కలే 

రూ. 8 కోట్లు పెట్టినా.. పానాలు దక్కలే 

చెన్నై: కరోనా బారిన పడిన ఓ రైతును కాపాడుకునేందుకు ఆయన కుటుంబం రూ. 8 కోట్లు ఖర్చు చేసినా ప్రాణాలు దక్కలేదు. మధ్యప్రదేశ్​ మౌగంజ్ లోని రక్రికి చెందిన రైతు ధర్మజయ్ సింగ్ (50) నిరుడు కరోనా బారిన పడ్డారు. కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఊపిరితిత్తుల సమస్యతో పరిస్థితి సీరియస్ కావడంతో ఐసీయూలో ఉంచి డాక్టర్లు ట్రీట్​మెంట్ చేశారు. లండన్ నుంచి, ఇతర దేశాల నుంచి ప్రముఖ డాక్టర్లను పిలిపించి చికిత్స చేయించినా బాగుకాలేదు. రోజుకు 3 లక్షల చొప్పున ఖర్చు చేస్తూ 8 నెలలకు పైగా ట్రీట్​మెంట్ అందించారు. ఈ క్రమంలో ఊపిరితిత్తుల్లో ఇన్​ఫెక్షన్ పెరగడంతో సింగ్​ మంగళవారం చనిపోయారని డాక్టర్లు తెలిపారు.